
ఓ కాలనీ.. ఓ నగరం.. ఓ మహా నగరం.. నిర్మాణం కావాలంటే నెలలు.. సంవత్సరాలు.. దశాబ్దాలు పడుతుంది. కానీ ఢిల్లీలో ప్రపంచంలోనే 'అతిపెద్ద టెంట్ నగరం' రోజుల వ్యవధిలో నిర్మితమైంది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలకు ఈ నగరం వేదికైంది. ఉద్యమంలో భాగంగా వారు గత 65 రోజులుగా ఈ టెంట్ నగరంలోనే నివాసం ఉంటున్నారు. మనం ఒక్కరోజు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే.. ఏ సదుపాయాలూ లేకుండా ఉండటానికి నానా అవస్థలూ పడుతుంటాం.. అలాంటిది ఏకంగా అన్ని రోజుల పాటు ఎముకలు కొరికే చలిలో టెంట్‌లలో బస చేస్తున్నారంటే.. వారు పడుతున్న అవస్థల కన్నా ఆశయం ఎంత గొప్పదో అర్థంచేసుకోవచ్చు. ఎండకూ.. వానకూ.. చలికి వెరవక.. ప్రభుత్వ విధానాలపై తమ నిరసనను ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న రైతులకు సలాం కొట్టాల్సిందే! జై కిసాన్ అనాల్సిందే !!
చిత్రమాలిక



