ప్రజాశక్తి-విశాఖ : అసైన్డ్ చట్టానికి తూట్లు పోడుస్తూ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను పెద్దలకు, అప్పజెప్పె ప్రభుత్వ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేసారు గురువారం అయిన ఓప్రకటన విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాని కంచె చేనుమేసునట్లుగా ప్రభుత్వ మే ధనవంతులకు అసైన్డ్ భూములు కట్టబెట్టె ప్రయత్నం చేస్తూ పేదలను నడిరోడ్డుపై నిలబెట్టె ప్రయత్నం చేస్తుందని ఇది అత్యంత దుర్మార్గామన్నారు చర్యని తెలిపారు. పేదలకున్న ఆర్థిక అవసరాలను ఆసారగ తీసుకోని ధనవంతులు దాన్ని అవకాశంగా మలుచుకోని వారికి ఇచ్చినటువంటి భూములను తనఖా, లీజు, కొనుగోలు వంటి వివిధ రూపాలలో రాష్ట్రంలోని ధనిక భూస్వామి వారు స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు, 1977 లోనే ఆనాటి శాసనసభ ఈ ఎక్టును గుర్తింపు పొందిందని.ఈ రోజు ఆరోజు శాసనసభలో ఉన్న వామపక్ష పార్టీ శాసన సభ్యులు శాసన సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్‌మెంట్ భూములు బదలాయింపు నిషేధిత చట్టాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చిందని అన్నారు.ఈ చట్టం ద్వారా ప్రభుత్వ బంజరు భూములు, సీలింగ్ మిగులు భూములు, భూదాన భూములు ఇలా ఏ రూపంలో ప్రభుత్వం నుంచి పేదలకు భూములు ఇచ్చిన అన్యాక్రాంతం నిషేధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా పేదల నుండి భూములు పొందితే వారికి ఆరు నెలలు జైలు శిక్ష, 2000 రూపాయలు జరిమానా విధిస్తూ చట్టాన్ని రూపొందించారని ఈ సందర్భంగా ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలో వచ్చిన కాంగ్రెస్, పార్టీ తరువాత తెలుగుదేశం పార్టీ, నేడు తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలు ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు పరచలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డి పట్టా భూములను చట్ట విరుద్ధంగా తమ స్వాధీనంలో ఉంచుకున్న సామాజిక ఉన్నత వర్గాలకు ధనిక వర్గాలకు మేలు చేసే విధంగా వారికి అనుమతి ఇవ్వడానికి ఈ కొనుగోళ్లను రెగ్యులరైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆకృతీకరణ రూపొందించినట్లు తెలుస్తుందని అన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నం చేయడానికి సిద్ధపడగా ఆనాడు వామపక్ష పార్టీలు, దళిత గిరిజన ప్రజాసంఘాలు గట్టిగా వ్యతిరేకించాయని అన్నారు. స్వర్గీయ బొజ్జ తారకం హైకోర్టులో కేసు వేసి పేద ప్రజల వాదనలు వినిపించారని దాంతో రాజశేఖర్ వెనక్కి తగ్గారని ఇప్పుడు అతని సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మొదలు పెట్టిన పనిని పూర్తిచేసి పేదల భూములు ఆక్రమించిన సామాజిక ఉన్నత వర్గాల వారికి ధనిక వర్గాల వారికి ఇక ఎలాంటి భయము లేకుండా అడ్డగోలుగా అసైన్డ్ భూములు ఆక్రమించిన వారికి అన్యాక్రాంతం చేసిన వారికి కట్ట బెట్టాలని చూస్తూన్నారని వెంటనే దీనిని విరమించుకోవాలని లెదంటే ప్రభుత్వం తగిన మూల్యం చేల్లించక తప్పదని హెచ్చరించారు,










