
గువహటి : తన పార్టీని తృణమూల్ కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిందిగా ఆహ్వానించారని రైజోర్ దళ్ చీఫ్ అఖిల్‌గొగోరు పేర్కొన్నారు. తన పార్టీని టిఎంసిలో విలీనం చేస్తే.. తనను అసోం టిఎంసి యూనిట్ అధ్యక్షుడిగా నియమిస్తానని హామీ ఇచ్చారని మీడియా సమావేశంలో చెప్పారు. రైజోర్ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే టిఎంసితో మూడు రౌండ్లలో చర్చలు జరిపామని అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దించేందుకు యత్నిస్తోందని అన్నారు. 2024 ఎన్నికల్లో మోడీని గద్దెదింపడమే తమ లక్ష్యమని అన్నారు.