May 27,2023 16:13

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ :  నారాయణవరం మండలం బ్రాహ్మణ తాంగేల్ గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన డా.గుణశేఖర్ చదువు మీద ఉన్న శ్రద్ధతో మరియు నిబద్ధతో పై చదువులు చదవడం. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కోరికతో రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసి అనేక జాతీయ, అంతర్జాతీయ సెమినార్స్, కాన్ఫరెన్స్లలో ప్రసంగించి ఉన్నారు. గతంలో అనేక అవార్డులు పొందడం జరిగింది. బెంగళూరులో జరిగిన నేషనల్ యూనిటీ కాన్ఫరెన్స్ 2023లో  గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ వారు జాతీయస్థాయిలో పరిశోధనలు చేసి విశేష ప్రతిభ కనబరిచే వారికి రెండేళ్లకు ఒకసారి  ఏషియన్ ఐకాన్ గోల్డ్ మెడల్ అవార్డు* ను ప్రధానం చేయడం జరిగింది. గోల్డ్ మెడల్ అవార్డు, షీల్డ్  మరియు సర్టిఫికెట్ తో సత్కరించడం జరిగింది. డాక్టర్ గుణశేఖర్ మధుమేహం వ్యాధిని తగ్గించే విధంగా ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ ఉపయోగించి మంచి ఫలితాన్ని కనుకున్నారు (యాంటీ డయాబెటిక్) మీద అనేక పద్ధతులను తన ప్రయోగం కొనసాగిస్తున్నారు. వీటి పైన ఇప్పటికే తన పరిశోధన పత్రాలను సమర్పించి ప్రచురించి ఉన్నారు. రక్తంలో గ్లూకోస్ లెవెల్ ఏ రకంగా మార్పులు చెందుతాయి అనేదానిమీద కొత్త కొత్త పద్ధతుల్లో ప్రయోగం చేయడం జరిగింది. తన ప్రయోగంలో ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్స్ ను తీసుకొని వాటిని ఇన్-విట్రో మరియు ఇన్- వివో పద్ధతుల్లో అల్లక్సన్ ఇందూస్డ్ డయాబెటిక్ ఎలుకల మీద ప్రయోగాలు చేసి మంచి ఫలితాన్ని కనుగొనడం జరిగింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచేటువంటి వారిని గుర్తించి రీసెర్చ్ , మెడిసిన్, కళలు, సామాజిక సేవ, ఇంకా అనేక రంగాల్లో తమ వంతుగా సేవ చేస్తూ ఉండే వారిని గుర్తించి అవార్డు ప్రధాన చేయడం జరిగింది. ఎడ్యుకేషన్, రీసెర్చ్  విభాగం లో డా గుణశేఖర్ కు అవార్డు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో తన ప్రయోగంలో ఇంకా కొనసాగిస్తానని  వివరించడం జరిగింది. ఈ ప్రయోగాలను క్లినికల్ ట్రైల్స్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయని ఆశాభావం వ్యక్తపరిచారు. నాకు ఈ అవార్డు రావడం నా మీద బాధ్యత ఇంకా పెరిగిందని వివరించడం జరిగింది. ఈ సంవత్సర అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని వివరించారు. గతంలో యాంటి-క్యాన్సర్, యాంటి-ఇన్ఫ్లమేటరీ మరియు యాంటి-అల్సర్ మీద ప్రయోగాలు చేశారు. అనేకమంది శ్రేయోభిలాషులు, సహచర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.