Oct 06,2023 10:58

ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతుంది. తాజాగా మహిళల కబడ్డీలో భారత్ జట్టు ఫైనల్ కు చేరుకొని పతకం ఖాయం చేసుకుంది.  నేడు హాంగ్‌జౌలో కబడ్డీ సెమీ-ఫైనల్‌లో భారత్ నేపాల్ తో తలపడింది. 61-17 స్కోర్ తో భారత్ మహిళా కబడ్డీ జట్టు నేపాల్ ను ఓడించింది. ఈ విజయంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. భారత రైడర్లు చక్కని ప్రదర్శనతో తొమ్మిది బోనస్ పాయింట్లను సాధించగలిగారు. డిఫెండర్లు ఐదు ఆల్-అవుట్‌లను సాధించారు. ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచిన భారత్ జట్టు నేపాల్ పై పైచేయి సాధించింది. దీంతో స్వర్ణం పోరులో ఇరాన్ లేదా చైనీస్ తైపీతో శనివారం తలపడనుంది.