అశ్వ వాహనంపై స్వామి అమ్మవార్లు
- శ్రీశైలంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు
ప్రజాశక్తి-శ్రీశైలం
ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ఐదోరోజు మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది మహోత్సవాలలో భాగంగా గురువారం పూర్ణాహుతి , అశ్వ వాహనంపై స్వామి అమ్మవార్లు నిజాలంకారంలో భ్రమరాంబ దేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు వేద పండితులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా నారికేలములు పలు సుగంధ ద్రవ్యాలు ముత్యం పగడం నూతన వస్త్రాలు తదితర ద్రవ్యాలను హోమ గుండంలో వేదమంత్రాలు మధ్య సమర్పించారు. ఆ తర్వాత వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం అవబృందం, త్రిశూల స్నానం వంటి కార్యక్రమాలు మల్లికా గుండంలో చండీశ్వరునికి సంప్రోక్షణ త్రిశూల స్నానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
అశ్వ వాహనంపై స్వామి అమ్మవార్లు : ఉత్సవాలలో భాగంగా అశ్వ వాహనంపై స్వామి అమ్మ వాళ్ళు ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమాన్ని వేదమంత్రాలు మధ్యనిర్వహించారు.
నిజాలంకరణలో భ్రమరాంబ దేవి : శ్రీశైలం క్షేత్రంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు అలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 5వ రోజున భ్రమరాంబ దేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిగిలిన రోజులలో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు కానీ ఒక ఉగాది మరుసటి రోజున మాత్రమే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే భక్తులకు ఈ విధంగా దర్శన ఇస్తారు. నిజాలంకరణలో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.










