
. ఆసుపత్రిలోని వార్డులను, సికిల్ సెల్ ఎనీమియా ల్యాబ్‌ను పరిశీలించారు.
ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు జిల్లా ఆసుపత్రిని సోమవారం ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించింది. ఆసుపత్రిలోని వార్డులను, సికిల్ సెల్ ఎనీమియా ల్యాబ్‌ను పరిశీలించారు. ఆసుపత్రి అభివృద్ధికి సలహాలు, సూచనలు చేశారు. బృందం వెంట డిఎం అండ్ హెచ్‌ఒ జమాల్ బాషా, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కె.కృష్ణారావు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ శంకర్ ప్రసాద్ ఉన్నారు.