అడవిలో వదిలిన స్నేక్ సేవియర్
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
బుట్టాయగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశించిన జెర్రీపోతు పామును స్నేక్ సేవియర్ పట్టుకున్నారు. సొసైటీ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం... పాము ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించగా జంగారెడ్డిగూడెం సమీపంలోని స్నేక్స్ సేవియర్ సొసైటీ వారికి సమాచారం అందించారు. స్నేక్స్ సేవియర్ సొసైటీ వారు హాస్పిటల్‌కి చేరుకొని పామును పట్టుకున్నారు. అయితే ఈ పాము జెర్రిపోతూ పామని దీనివల్ల ఎటువంటి హాని ఉండదని తెలిపారు. పట్టుకున్న ఈ పామును స్నేక్స్ సొసైటీ వారు సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతారని తెలిపారు.










