Nov 01,2022 23:35

ఆశావర్కర్లకు బ్యాగులు అందజేస్తున్న డాక్టర్‌ హిమబిందు

ప్రజాశక్తి - సీలేరు: గర్భిణులు ఆరోగ్యంపై ఆశావర్కర్లు ప్రత్యేక దృష్టి సారించి, వారిని రెగ్యులర్‌గా ఆసుపత్రికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు తల్లీబిడ్డ శ్రేయస్సు దృష్ట్యా వారిని ఆసుపత్రిలోనే ప్రసవించేందుకు వచ్చేలా అవగాహన కల్పించాలని జికె.వీధి మండలం దారకొండ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ డికె.హిమబిందు సూచించారు. మంగళవారం పిహెచ్‌సిలో ఆశా డే నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ ఆశ వర్కర్లు గ్రామాల్లోని ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఏమాత్రం అనారోగ్యం వచ్చినా ఆసుపత్రికి వెళ్లి వైద్యసేవలు పొందేలా చైతన్యపరచాలన్నారు. గర్భిణులు డెలివరీ తేదీకి కనీసం ఐదు రోజులముందు ఆసుపత్రికి వచ్చి జాయిన్‌ అయ్యేలా ప్రోత్సాహించాలని, దారకొండలో సుఖప్రసవం జరగకుంటే, వెంటనే చింతపల్లి సిహెచ్‌సికి తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆశావర్కర్లు బాధ్యతగా విధులను నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.