
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :బిజెపి పాలనలో దేశ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా విమర్శించారు. ఈ నెల 15వ తేదీ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని నరకూరు సెంటర్లోనే జెక్కా వెంకయ్య స్మారక సిఐటియు కార్యాలయంలో నరుకూరు సెంటర్ ఆటో యూనియన్ అధ్యక్షులు నాశీన పరశురామయ్య అధ్యక్షతన ఆటో యూనియన్ సమావేశం జరిగింది. రాజా పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సిపిఎం తలపెట్టిన ప్రజారక్షణ బేరి చలో విజయవాడ నవంబర్ 15 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలను కలవరిపరుస్తున్నాయన్నారు.ఆటో యూనియన్ కమిటీ సభ్యులు శేషయ్య, గోపి, గణేష్, దయాకర్, భాస్కర్, లక్ష్మయ్య బాషా, కనకయ్య, సీను, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి వెంకట శేషయ్య ఉన్నారు.