ప్రజాశక్తి-రోలుగుంట:మహాశివరాత్రిని పురస్కరిం చుకొని మండలంలోని కుసర్లపూడి గ్రామంలో పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఆశ్రమాన్ని ఎంవిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు తనయుడు ముత్యాల సతీష్ సందర్శించారు. ముందుగా సుబ్బారాయుడుపాలెం గ్రామం నుండి సుమారు 100 బైకుల ర్యాలీతో బయలుదేరి పాకలపాడు ఆశ్రమానికి చేరుకున్నారు. ఆలయ నిర్వహకులు, మహిళలు ఘన సతీష్‌ఖు స్వాగతం పలికారు. శ్రీపాకలపాడు గురుదేవుని వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆ మహాశివుని దర్శించుకున్నారు. ముత్యాల సతీష్ చేతుల మీదుగా నిరుపేదలకు దుప్పట్లు, రగ్గులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ ఆశ్రమానికి ముత్యాల సతీష్ ఆలయ నిర్వహణకు ధన సాయం చేశారు. ఆలయ నిర్వాహకులు సతీష్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గండి సింహాద్రి, ఎంవిఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.










