Nov 21,2022 23:52

ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

గిరిజన సంక్షేమ కార్యదర్శి కాంతీలాల్‌ దండే ఉత్తర్వులకు ఖండన
ప్రజాశక్తి పాడేరు
:గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఇతరుల ప్రవేశం నిషేధమని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఉత్తర్వులను జారీ చేయడంపై ఎస్‌ఎఫ్‌ఐ వ్యతిరేకించింది. .సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభు మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో 122 ఆశ్రమ పాఠశాలలో వర్కర్స్‌, హెల్త్‌ వర్కర్స్‌, వాచ్‌మెన్‌, ఉపాధ్యాయుల ఖాళీల నియామకం, మెస్‌ చార్జీల పెంపు, కాస్మోటిక్స్‌ సరఫరా వంటి సమస్యలెన్నో వుంటే, వాటిని పట్టించుకోకుండా ఆశ్రమాలపై నిషేధాజ్ఞలు విధిస్తారా అంటూ గిరిజన సంక్షేమ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కాంతిలాల్‌ దండేను సూటిగా ప్రశ్నించారు. బోధనేతర సిబ్బంది కొరతతో విద్యార్థులకు భద్రత లేదని, అల్లూరి జిల్లాలో విద్యార్థుల మరణాలను పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఆశ్రమాల నిర్వహణలో వైఫల్యాలు, లోపాలు డొల్లతనం బయటపడకుండా ఉండడానికే ఇటువంటి నిషేధాజ్ఞలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థి సంఘాలుగా తాము కచ్చితంగా పాఠశాలలు, కళాశాలలు సందర్శిస్తామని, విద్యార్థుల సమస్యలు బయటకి తీసుకొచ్చి ఉద్యమాలు, పోరాటాలు నడుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్‌,వరహాలు మరియు మండల నాయకులు మచ్చ రాజు,మాణిక్యం పాల్గొన్నారు..