విద్యార్థిని అభినందిస్తున్న దృశ్యం
ఆశ్రమ విద్యార్థికి అభినందనలు
ప్రజాశక్తి-నెల్లూరు :జనహిత వాత్సల్య అనాధ చిన్నారుల, వద్ధుల ఆశ్రమం నందు పసితనం నుండే ఆశ్రమంలో పెరిగి మంచిగా విద్యనభ్యసించి ఐఐటి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ) భువనేశ్వర్ నందు ఇంజినీరింగ్ సీటు సాధించిన సాయి అనే విద్యార్థిని ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వి సాంబశివరావు గారి నేతత్వంలో ఎపిజిఈఎఫ్ జిల్లా చైర్మన్ చేజెర్ల సుధాకర్ రావు, మానవ సేవయే మాధవ సేవ టీం నిర్వాహకులు అరవ పరిమళ ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి నిరాదరణకు గురై, వాత్సల్య సంబంధిత భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివి, అనంతరం ఇంటర్ పూర్తి చేసి దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఐఐటి భువనేశ్వర్లో ఇంజనీరింగ్ సాధించడం చాలా గొప్ప విషయం అని, వాత్సల్య యాజమాన్యం ,ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.వి. సాంబశివరావు, అధ్యాపకులు సిబ్బంది సేవలు అభినందనీయమని, వాత్సల్య ఆశ్రమం నందు చదువుతున్న మిగతా విద్యార్థులకు ఇది ఒక ప్రేరణ అని అన్నారు. ఐఐటి భువనేశ్వర్ నందు ఇంజినీరింగ్ సీటు సాధించిన సాయికి ట్రాలీ బ్యాగ్, కొత్త బట్టలు, 6 వేలు నగదును సేవా టీం నిర్వాహకులు అరవ పరిమళ, రాఘవ . విశ్వనాథం, ఆర్. ఇందిర,కోలా. రవి ముత్యాల .శ్రీనివాసులు ,బి. విజయమ్మ, సురేష్, అక్షయ అందజేశారు










