రికార్డులను పరిశీలిస్తున్న ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని ఏడుగు రాళ్లపల్లి బొడ్డుగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చింతూరు ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఫుడ్ కమిటీ వారి ద్వారా తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఏడుగు రాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది వివరాలను పరిశీలించి మందుల స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు ఫార్మసిస్ట్ ల్యాబ్‌లను తనిఖీ చేసి మందుల వివరాలను తెలుసుకున్నారు.










