ప్రజాశక్తి -రంపచోడవరం
మండలంలోని పెద్ద గెద్దాడ జడ్పీ హైస్కూల్, రంపచోడవరం గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాల, గురుకుల జూనియర్ కళాశాలను ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విద్యా సంస్థల్లో విద్యా బోధన తీరుపై ఆరా తీశారు. గురుకుల పాఠశాలలోని కిచన్‌ను పరిశీలించిన ఆయన ఇప్పటివరకు ఎన్ని బస్తాల బియ్యం నిల్వ ఉన్నది, ఇతర నిత్యవసర వస్తువులు ఏమేమి ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలని శ్రద్ధగా విని మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత ఉద్యోగాలకు పోటీ పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరసింహమూర్తి, మండల విద్యాశాఖ అధికారి కెవివి సత్యనారాయణదొర, సర్పంచ్ వి.ప్రసాద్, ఉపాధ్యాయులు కె.సూరిబాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










