పజాశక్తి పాయకరావుపేట: వైసిపి పాలనలో మహిళలకు వైయస్సార్ ఆసరా లభిస్తుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు స్థానిక మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల డ్వాక్రా మహిళలకు వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ, రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఆసరా మూడో విడత ఆసరా జమ చేయడం జరిగిందని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 6578 పొదుపు సంఘాలకు వైఎస్‌ఆర్ ఆసరా పథకం కింద 3 విడతల్లో రూ.5,306 కోట్లు మహిళలు ఖాతాలోకి జమ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట మండల అధ్యక్షులు ఇసరపు పార్వతి తాతారావు, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు, పాయకరావుపేట సర్పంచ్ గార ఉషశ్రీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, వైస్ ఎంపీపీలు దని శెట్ట మాధవి, పల్లెలు మణికంఠ స్వామి, ఉప సర్పంచ్ జిగతా భవాని శ్రీను, స్వయ సంఘాల అధికారులు మండలాధికారులు నాలుగు మండలాల ఎంపీటీసీలు, సర్పంచులు, నియోజవర్గ స్థాయిలో మహిళలు పాల్గొన్నారు.
గొలుగొండ:మహిళా పక్షపాతి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ అన్నారు. సోమవారం గొలుగొండలో వైయస్సార్ ఆసరా మూడో విడత చెక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పథకంలో మహిళలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలను ఆపకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చారన్నారు. మండలంలో ఇప్పటి వరకు 10,890 డ్వాక్రా మహిళలకు మూడు విడతలుగా రూ.22 కోట్లు ఆసరా పథకం ద్వారా పంపిణీ చేశామన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 120 కోట్లు నేరుగా డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్‌నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, వైస్ ఎంపిపిలు జక్కు నాగమణి, సుర్ల ఆదినారాయణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, మండల యూత్ అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, బిసి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బొందల రాజు, తహశీల్దార్ ఆనందరావు, ఎంపిడిఒ డేవిడ్‌రాజు, వెలుగు ఏపిఎం మంగ, పంచాయతీ కార్యదర్శులు, ఎస్సై నారాయణరావు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










