Apr 02,2023 00:32

చెక్కును విడుదల చేస్తున్న రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ప్రజాశక్తి -అనకాపల్లి
మండలంలోని తుమ్మపాల బంగారురాజు కల్యాణ మండపంలో శనివారం వైయస్సార్‌ ఆసరా మూడో విడత చెక్కులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విడుదల చేశారు. అనంతరం ఎంపిపి గొర్లి సూరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి మండలంలో 19 వేల మంది డ్వాక్రా మహిళలకు సుమారు 14 కోట్ల రూపాయలు రుణమాఫీగా అందజేయడం జరిగిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు భీశెట్టి వరాహ సత్యవతి, డిఆర్డిఏ పథక సంచాలకులు లక్ష్మీపతి, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ రామ్మూర్తి, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు జోసెఫ్‌, వైస్‌ ఎంపీపీ విల్లూరి సూర్యకుమారి శేఖర్‌, తుమ్మపాల సర్పంచ్‌ తట్ట పెంటయ్య నాయుడు, ఎంపీటీసీ సభ్యులు కన్నారావు, వైసిపి నాయకులు మల్ల బుల్లిబాబు, వెంకటలక్ష్మి, భారతి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండల కేంద్రంలో ఆసరా ఆసరా నిధులు రూ.10.43 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు శనివారం ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అందజేశారు. అనంతరం ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం మారుమూల గ్రామాల్లో ఇంటి వద్దకే వైద్య సేవలు అందించే విధంగా ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో 34,935 సంఘాలకు 296.77 కోట్లు ఆసరా ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఈర్లె అనురాధ, పకృతి బాబురావు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని దిబిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డ్వాక్రా సంఘాల సభ్యులకు చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ శనివారం స్థానిక నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని 1297 డ్వాక్రా సంఘాలకు రూ.7.64 కోట్లు మూడో విడతలో అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాకారపు నాగేశ్వరి దేవి, జెడ్పిటిసి దొండ రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు కొల్లిమల్ల అచ్చం నాయుడు, ఎంపీడీవో సువర్ణరాజు, తహశీల్దార్‌ ఎస్‌వి అంబేద్కర్‌, ఏపీఎం వై.బాలరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.