Mar 30,2023 00:14

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ప్రజాశక్తి-చోడవరం
స్థానిక శివాలయం వద్ద చోడవరం మండలంలోని డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులను ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్‌ మోహన్‌ రెడ్డిని మరొక మారు ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసు, ఎంపీడీవో ఎస్డి.శ్యామ సుందర్‌, స్థానిక సర్పంచ్‌ నూకాలమ్మ, వైస్‌ ఎంపీపీలు బుద్ధ గంగరాజు, బైన ఈశ్వరరావు, వైసిపి నాయకులు బొడ్డేటి సూర్యనారాయణ, వెంపలి ఆనందేశ్వరరావు, దొడ్డి హనుమంతరావు, ఓరుగంటి నెహ్రూ, బొడ్డు శ్రీరామ్మూర్తి, అల్లాడ భవాని తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ సంతబయలు వద్ద వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం చెక్కులను డ్వాక్రా మహిళలకు పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో 5319 ఎస్‌హెచ్‌జిఎస్‌లో ఉన్న 45,324 మంది పేద మహిళలకు 3వ విడతగా 53.08 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, పరవాడ సర్పంచ్‌ సిరిపురపు అప్పలనాయుడు, జడ్పీటీసీ పైల సన్యాసిరాజు, వైస్‌ ఎంపీపీలు బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, వైసిపి నాయకులు చుక్క రామునాయుడు, కోన రామరావు, ఎంపీడీఓ హేమ సుందరరావు, ఎపిఎమ్‌ కనకమ్మ, పలువురు సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.