Apr 03,2023 00:36
చెక్కును పంపిణీ చేస్తున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి

ప్రజాశక్తి-చెరుకుపల్లి: హామీల అమలులో మాటతప్పని జగన్మోహన్‌రెడ్డిని మరల ఆదరించాలని రాజ్యసభ సభ్యులు వెంకటరమణారావు అన్నారు. మూడవ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం గొల్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ప్రసంగిం చారు. సంక్షేమ పథకాలతో కుటుంబ అభివృద్ధితోపాటు మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు మత్తీ దివాకర రత్నప్రసాద్‌, ఎంపీడీవో బి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పైనం ఏడుకొండలరెడ్డి, మాజీ ఎంపీపీ చెన్నూ కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చీరాల ప్రసాద్‌రెడ్డి ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.