Jul 08,2020 13:29

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో సిబ్బంది దుర్మార్గంగా వ్యవహరించారు. కరోనాతో హాస్పిటల్‌లో చేరిన ఓ డాక్టర్‌కు నరకం చూపించారు. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ పెట్టకపోయినా.. వెంటిలేటర్‌ పెట్టినట్లు ఆస్పత్రి యాజమాన్యం భారీగా బిల్లులు వసూలు చేసింది. మందులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు బిల్లులు వేశారని పేర్కొన్నారు. దీంతో యాజమాన్య దుర్మార్గంపై బాధితురాలు డాక్టర్‌ విజయ కేసరి మీడియాతో తన ఆవేదన చెప్పుకుంది. తనకు 14 రోజులుగా నరకం చూపించారని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. బిల్లులపై ప్రశ్నించినందుకు తనను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.