Sep 23,2023 18:55

మాట్లాడుతున్న డాక్టర్‌ శకుంతల

ప్రజాశక్తి-కందుకూరు :తప్పుడు వార్తలతో కందుకూరు ఏరియా ఆస్పత్రి ప్రతిష్టను దిగజార్చ వద్దని ఆస్పత్రి బాధ్యులు డాక్టర్‌ శకుంతల పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో శకుంతల విలేకర్లతో మాట్లాడారు. గత రెండు రోజుల కిందట ఒక మహిళ చంటి బిడ్డతో ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షలకు డబ్బులు అడిగినట్లుగా, దానికోసం తన కాళ్ల పట్టిలను తాకట్టు పెట్టినట్లు సోషల్‌ మీడి యాలో రావడం తమను కలిచివేసిందన్నారు. అసలు ఆ మహిళ ఆసుపత్రికి రానే రాలేద న్నారు. వచ్చినట్లు తమ వద్ద వివరాలు లేవన్నారు. ఆరోజు ఆస్పత్రి ఓపి లిస్టులో ఆ సదరు మహిళ పేరు లేదన్నారు. అది ముమ్మాటికీ ఫేక్‌ వార్తని ఆమె ఖండించారు. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆస్పత్రిని ముందుకు తీసుకెళ్తున్నామని,దీనికి ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. సమావేవంలో డాక్టర్‌ ఇంద్రాణి ఉన్నారు.