Aug 01,2021 12:57

గువహటి : సరిహద్దు వివాదాన్ని అసోంతో చర్చించి పరిష్కరించుకుంటామని మిజోరాం ముఖ్య్యమంత్రి జోరంతంగా ఆదివారం చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మతో ఫోన్‌లో సంభాషించిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు మరింత చేయిదాటి పోకుండా చూడాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ' అమిత్‌షా, హిమంతతో ఫోన్‌లో సంభాషించిన మేరకు...మిజోరాం- అసోం సరిహద్దు విషయాన్ని సామరస్య చర్చల ద్వారా పరిష్కరించేందుకు అంగీకరించాం' అని ట్వీట్‌ చేశారు. సరిహద్దుల మధ్య నెలకొన్న ఈ ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. దీంతో అసోం ముఖ్యమంత్రి హిమంతతో పాటు పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులపై మిజోరాం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. అయితే సామరస్య చర్యల నేపథ్యంలో ఆయనపై కేసు వాపస్‌ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.