అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి : సిపిఎం
ప్రజాశక్తి - నందికొట్కూరు
అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళ వారం వ్యకాసం నాయకులు వేణుగోపాల అధ్యక్షతన నందికొట్కూరు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నగర్ కాలనీలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంక టేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి పకీర్ సాహెబ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వ్యవసాయ కార్మికులు అసంఘటిత కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని వారు ఆరోపిం చారు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. వ్యవసాయంలో వ్యవసాయ కార్మికులను పరిశ్రమల్లో కార్మికులను తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమదోపిడి చేసుకొని లాభాలు పొందుతున్నారని వారు ఆరోపించారు. అసంఘటిత కార్మికుల ఓట్లతో అధికారంలోకి వస్తున్న పాలకులు వారికి సమగ్ర చట్టం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర చట్టం చేయడం వల్ల 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 5000 పెన్షన్ ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించడంతోపాటు విద్యా, వైద్యం,గృహవసతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గోపాలకృష్ణ, ఆర్ జయరాన్ని, లక్ష్మీదేవి, నారాయణ, పకీరయ్య, గౌసియా, కాసిం, సుబ్బమ్మ పాల్గొన్నారు.










