Nov 04,2023 21:41

ప్రజాశక్తి - ముసునూరు
  అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చిన సైకో పాలనకు త్వరలోనే అంతం తథ్యమని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం గుళ్లపూడి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు 'బాబుకు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన పోలీస్‌ శాఖ ప్రతిపక్ష నాయకులను ఎలా హౌస్‌ అరెస్టులు చేయవచ్చు అనేదే ఆలోచిస్తుంది కానీ రాష్ట్రం గంజాయాంధ్రప్రదేశ్‌గా మారుతున్న విషయంపై కనీసం దృష్టి సారించడం లేదన్నారు. నేడు మారుమూల ప్రాంతాలకు కూడా గంజాయి సరఫరా అవుతున్నా నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు కళ్లు మూసుకుని కూర్చుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గద్ధె రఘుబాబు, కొల్లి గంగారామ్‌, మందలపు ధర్మరాజు, కందుల పిచ్చయ్య, మసిముక్కు సుబ్బారావు, లక్క పాము కాంతారావు పాల్గొన్నారు.