Nov 06,2023 22:33

విజయవాడలో రిక్షా తొక్కుతూ ప్రచారం...


ప్రజాశక్తి - వత్సవాయి : లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని రాష్ట్ర అభివద్ధే లక్ష్యంగా సిపియం ఆధ్వర్యంలో ఈ నెల 15న మాకినేని బసవ పున్నయ్య స్టేడియం, విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ సభ్యుడు చనుమోలు సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వత్సవాయి మండల కార్యదర్శి తమ్మినేని రమేష్‌, సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేడు బైక్‌ర్యాలీ : నేడు బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్‌ తెలిపారు. ఈ ర్యాలీ లింగాల నుండి చిట్యాల, మక్కపేట భీమవరం, గోపినేనిపాలెం, మంగోళ్ళు, పెద మోదుగుపల్లి, రామచంద్రపురం, ఇందుగుపల్లి, కన్నె వేడు తదితర గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మైలవరం : ఈ నెల 15వ తేదీన సింగ్‌నగర్‌ ఎంబి స్టేడియంలో జరిగే సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని పలు గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం విస్తతంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. గణపవరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. వెల్వడం, మైలవరం, మీదుగా అనంతవరం గ్రామాల్లో బైక్‌ ర్యాలీ కొనసాగింది. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాసులు పాలెం గ్రామం వద్ద బెండ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజారక్షణభేరి సభను అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రావూరి రమేష్‌ బాబు, మండల నాయకులు చాట్ల సుధాకర్‌ పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు : మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో సిపిఎం ప్రజా రక్షణ భేరి గోడ పత్రికను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా సెక్రటేరియట్‌ సభ్యుడు కోట కళ్యాణ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వల్లబుదాసు.తదితరులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట: కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయవాడలో ఈనెల 15న జరిగే ప్రజా రక్షణ బేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు కోటా కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట, చిల్లకల్లు, అనుమంచిపల్లి గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. బహిరంగ సభకు అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు.నందిగామ : నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో వాల్‌ పోస్టర్లు సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు కటారపు గోపాల్‌ పార్టీ నందిగామ కమిటీ సభ్యులు సయ్యద్‌ ఖాసిం, పాల్గొన్నారు.కంచికచర్ల : రైతు బజార్‌, మొయన్‌ రోడ్డు, చెవిటికల్లు రోడ్డు సెంటర్‌, వివిధ రంగాల కార్మీకలను కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట కళ్యాణ్‌ కర పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు బెజ్జం భూషణం, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ : ముఠా కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం ఈ నెల 15న సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ''ప్రజారక్షణ భేరి'' సభలో ముఠా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు పిలుపునిచ్చారు. గవర్నర్‌పేట ఆలీబేగ్‌ స్ట్రీట్‌ వద్ద ముఠా కార్మికుల జనరల్‌ బాడీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ జరుగుతున్న బహిరంగ సభలో ముఠా కార్మికుల కుటుంబాలతో సహా పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. అనంతరం బహిరంగ సభ పోస్టర్‌ విడుదల చేశారు. ముఠా మూడు చక్రాల బండిని తొక్కుతూ ముఠా కార్మికులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.దుర్గారావు, ముఠా వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం.సీతారాములు, నగరనాయకులు సిహెచ్‌ నరసింహులు, ముఠాకార్మికులు పాల్గొన్నారు. వాంబే కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె దుర్గారావు కోరారు. జంధ్యాల దక్షిణామూర్తి స్కూల్‌ వద్ద నుండి ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం సెంట్రల్‌ సిటీ నగర కమిటీ సభ్యులు షేక్‌ పీరు సాహెబ్‌, నాయకులు పాల్గొన్నారు. గంపలగూడెం: స్థానిక పార్టీ కార్యాలయంలో సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారాం రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేకల నాగేంద్ర ప్రసాద్‌, మల్లవరపు కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు.