
ప్రజాశక్తి-తాడేపల్లి : సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో 15న నిర్వహించే ప్రజా రక్షణ భేరి జయప్రదం కోసం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో శనివారం కరప త్రాలు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో కరపత్రాలను సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసమాన తల్లేని అభివృద్ధి కోసం సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రక్షణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారన్నారు. బిజెపి, వైసిపి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని, నిరసన తెలియజేయడానికి కూడా వీల్లేకుండా నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు బనాయి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు ఎం.భాగ్యరాజు, వి.వెంకటేశ్వ రరావు, ఇ.రామారావు, సిహెచ్.సుందరరావు, ఎస్‌కె పీరూసాహెబ్, కృష్ణ, బాబూరావు, కె.ఆంజనేయులు, కె.రామకృష్ణ, పార్ధసారధి, బక్కిరెడ్డి, పి.రాఘవులు, జానీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని మాదల సిపిఎం కార్యాల యంలో పోస్టర్‌ను సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమర్ తదితరులు ఆవిష్కరించారు. సిపిఎం మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడారు. నాయకులు కె.సాంబ శివరావు, ఎం.వెంకటరెడ్డి, జి.జాలయ్య, పి.సైదాఖాన్, నాగమల్లేశ్వరరావు, కె.నాగేశ్వర రావు, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజాశక్తి, పెదకాకాని రూరల్ : ప్రజారక్షణ భేరి బహిరంగ సభ జయప్రదం కోసం స్వర్ణపురి కాలనీలో ప్రచారం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి మాట్లాడారు. సిపిఎం మండల కార్యదర్శి ఎన్.శివాజీ, నాయకులు రామారావు, రాబర్ట్, ఆశ, బి.సాంబయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మండలంలోని కాజలో సిపిఎం విస్తృత సమావేశం టి.ప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. కాజాలో ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బి.కోటేశ్వరి, ఇ.నాగేందర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, కోటిరెడ్డి, మాధవరెడ్డి, రామారావు, బ్రహ్మారెడ్డి, శివయ్య, అప్పారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : స్థానిక పుతుంబాక భవన్‌లో పోస్టర్లను సిపిఎం సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి డి.విమల, మండల కార్యదర్శి పి.మహేష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు రోజురోజుకు కలవరపరుస్తున్నాయని అన్నారు. బిజెపి పాలనలో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. బుల్డోజర్ రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తోందని విమర్శించారు. స్త్రీలను నడిరోడ్డు మీద నగంగా ఊరేగించి విర్రవీగుతున్నారని మండిపడ్డారు. కార్మికులు హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లు తెచ్చారన్నారు. రైతు పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం కార్పొరేట్ సేవల్లో తరిస్తున్నారని అన్నారు. కృష్ణపట్నం, గంగవరం, మేజర్ పోర్టులతో పాటు రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొక్కటిగా అదానికీ నైవేద్యం పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపిని వైసిపి, టిడిపి, జనసేన ప్రశ్నించడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాల కోసం సిపిఎం పోరాడుతోందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.హరిపోతురాజు, ఆర్.పురుషోత్తం, పి.ప్రభాకర్, ఎ.వెంకటనారాయణ, ఎం.జ్యోతి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.