
వేరుశనగ పంటను తొలగిస్తున్న రైతులు
గుడిబండ : ఖరీఫ్ పంట సాగు రైతులకు గుండెకోతనే ముగిల్చింది. తీవ్ర వర్షాభావంతో సాగు చేసిన అరకొర పంట కూడా చేతికందకుండా పోయింది. పంటపై ఆశలు వదలుకున్న రైతులు వాటిని తొలగించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితే గుడిబండలో నెలకొంది. గుడిబండకు చెందిన మహిళా రైతులు పుట్టరంగమ్మ, లక్ష్మమ్మ, గిరియమ్మ, జయలక్ష్మమ్మ, గిరీష్, శీనప్ప తదితరులు వారు సాగుచేసిన వేరుశనగ బుధవారం నాడు ట్రాక్టర్లతో తొలగించేశారు. పంట సాగు కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశామని, వర్షాభావంతో పంట మొత్తం పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.