Nov 16,2023 21:54

ఆశలన్నీ టమోటా పైనే.

 చాపాడు : మైదుకూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో రబీ సీజన్‌లో రైతులు టమోటా పంటను సాగుచేశారు. జిల్లాలో అధికంగా మైదుకూరు మండల పరిధిలోనే పంటను సాగు చేస్తారు. మండల పరిధిలోనే సుమారు 6వేల ఎకరాల వరకు టమోటా పంట వేశారు. దువ్వూరు, చాపాడు, ఖాజీపేట మండలాలలో 2 వందల ఎకరాలలో, ఇతర మండలాలలో వంద ఎకరాలలోపు టమోటాను సాగు చేస్తున్నారు. ముందుగా సాగుచేసిన టమోటా దిగుబడి వారం పది రోజుల్లో ప్రారంభంకానుంది. డిసెంబర్‌ మొదటి వారం నుంచి టమోటా దిగుబడి అధికంగా రానుంది. టమోటా ఎకరా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు రూ. 30 వేల వరకు ఖర్చులు అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ లో కిలో రూ. 35 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మన ప్రాంతంలో అమ్మకాలు చేపట్టే టమోటాను మదనపల్లి చిత్తూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మైదుకూరు ప్రాంతంలో ముందస్తుగా సాగుచేసిన పంట 30 కేజీల బాక్స్‌ ధర రూ. 550 పలుకుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. రాబోయే నెలరోజుల పాటు వర్షాలు నమోదు అయితే పంట దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయని రైతులు వాపోతున్నారు.ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లి పంట దిగుబడులు కాస్త తగ్గిన ధరలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. క్వింటా ఉల్లి గడ్డలు ప్రస్తుతం రూ.4500 పలుకుతున్నాయి. ఉల్లి సాగుచేసిన రైతులకు ఉప యోగకరంగా ఉంది. మిగిలిన రైతుల ఆశలన్నీ టమోటా పం టపై ఉన్నాయి. గత ఏడాది 30 కేజీల బాక్స్‌ ధర ఈ సమయానికి రూ. 400 వరకు అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం రూ.600 వరకు పలు కుతోంది .కేవలం ఈ ఏడాది ఒక నెలపాటు ఈ ధరలు ఉంటే ఎకరాకు రూ. 50 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరా టమోటా పంటలో వారానికి 100 బాక్సుల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొం టున్నారు. ధరలు కాస్త ఉంటే ఎరువులు, పురుగు మం దులు పిచికారి చేసి పంటను జన వరి చివరి వరకు కాపాడు కోవ చ్చని రైతులు సూచిస్తున్నారు. ప్ర స్తుతం సాగుచేసిన టమోటా పంట వర్షాభావం వల్ల గత ఏడాది మాది రిగా ఆశాజనకంగా లేదని పురుగు బెడద, వైరస్‌ కూడా ఎక్కు వగా ఉందని రైతులు పేర్కొంటున్నారు.
ఎకరాకు రూ.30వేలు ఖర్చు
టమోటా సాగుకు ఎక రాకు రూ. 30 వేల వరకు ఖర్చు అవు తుంది. ప్రస్తుతం పం కు వైరస్‌ అధికంగా సోకి మొక్కలు చనిపోతున్నాయి. దిగుబడి వచ్చే సమ యానికి ధరలు ఏ విధంగా ఉంటాయో అని ఆందోళనగా ఉంది. ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు అధికమయ్యాయి. దిగుబడులు చేతికి వచ్చే సమయానికి ధరలు ఉండడం లేదు. టమోటా ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నాం.
-రామాంజనేయ రెడ్డి, ఉత్సలవరం, మైదుకూరు.పంటకు వైరస్‌ అధికంగా సోకుతుంది
టమోటా పంట సాగు చేసి నెల రోజులైంది. ఆశాజనకంగా ఉన్న పంట ప్రస్తుతం వైరస్‌ సోకి మొక్కలు చనిపోతున్నాయి. ఈ నెల చివరి నాటికి దిగుబడులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ధరలు 30 కేజీల బాక్స్‌ రూ. 600 వరకు పలుకుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు ఏవింధంగా ఉంటాయో అర్థం కావడం లేదు. వర్షాలు పడకపోవడంతో టమోటా పంట ఆశాజనకంగా లేదు. వర్షం పడితే పంటకు ఉపయోగం.
- వెంకట రావ్‌, టమోటా రైతు, వెంకటాపురం, మైదుకూరు.