ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సమాజంలో నైతిక విలువలు పతనం కావడం, ప్రసార, సమాచార, సాంకేతిక మాధ్యమాలు అశ్లీల ప్రసారం కావడం వంటివి మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరగ డానికి కారణాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. జిల్లా స్థాయి అశ్లీలత నిరోధక విభాగం ప్రథమ సమావేశం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహిం చారు. సమావేశానికి అశ్లీల నివారణ విభాగం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. అశ్లీలతను పారదోలేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధు లతో సమీక్షించారు. అశ్లీలతను అరికట్టేందుకు ఉన్న చట్టాలు, నిబంధనలను పోలీసు రెవెన్యూ, మున్సిపల్, విద్యాశాఖలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. సినిమా పోస్టర్లను హోర్డింగ్‌లపై మాత్రమే ప్రదర్శించుకో వాలన్నారు. ముందుగా మున్సిపల్ కార్యాల యంలో చూపి అశ్లీలత లేని వాటిని సిబిఎఫ్‌సి రేటింగ్స్ ద్వారా ఎ, యు/ఎస్‌ఎ, ఎస్ మొదలగు చిహ్నాలు, ఎపిఎఫ్‌సిసి వారి సీల్ ఉంటేనే ప్రదర్శించాలని స్పష్టం చేశారు. పండుగలు, తిరునాళ్ల సందర్భాల్లో మహిళలను అవమాన పరిచేలా చిత్రీకరించబడిన అశ్లీల పాటలను, నృత్యాలను, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించా లన్నారు. గ్రంథాలయాలకు అశ్లీల నవలలు, పత్రికలు రాకుండా చూసుకోవాలని సూచిం చారు. అశ్లీల ఫొటోలు, కథలు, సీరియల్స్ ప్రచురిస్తున్న ఒ వారపత్రికపై నరసరావుపేట, సత్తెనపల్లిలో ప్రజా, మహిళా సంఘాల కేసులు పెట్టడం అభినందనీయమన్నారు. వీటిపై సత్వర విచారణ జరిపి దోషులకు శిక్ష పడే చూడాలని ఎస్పీని ఆదేశించామని చెప్పారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు గోడలపై ఉన్న అన్ని రకాల గోడ పత్రికలను అక్టోబర్ 2 నుండి నిషేధిస్తున్నామని, గోడ పత్రికల్లేని జిల్లాగా పల్నాడుకు పేరు తేవాలని చెప్పారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, సేవా సంస్థలు, పెయింటింగ్ కళాకారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం, పల్నాడు ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సెల్ మెంబర్ కన్వీనర్ దీప్తి, అశ్లీలత ప్రతిఘ టన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈదర గోపీచంద్, గురజాల ఆర్డీవో అద్దయ్య, నరసరావుపేట ఫిలిం ఛాంబర్ ప్రతినిధి కె.బాలహను మంతరెడ్డి, మహిళా సంఘాల నాయకులు డి.శివకుమారి, హెల్డా ఫ్లారెన్స్, కృష్ణకుమారి, డి.ఉదయశ్రీ, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి టి.పెద్దిరాజు, కళాకారులు కె.నాగేశ్వ రరావు, పద్యకవి ఇ.వెంకటరెడ్డి పాల్గొన్నారు.










