
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాలను రాజకీయంగా ఎదగనివ్వకుండా ఎంఎల్‌ఎ అణిచివేస్తున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు ఆ వాస్తవాలను గ్రహించాలని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మంలో భాగంగా కందుకూరు పట్టణం 17, 19వ వార్డులోని ప్రాంతంలో మంగళవారం ఉదయం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమస్యలు తెలుసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలను స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు స్థానికులతో మాట్లాడుతూ ఎంఎల్‌ఎ తన ముఖ్య అను చరులకు కాంట్రాక్టులు, పదవులు కేటాయిస్తూ వెనుకబడిన వర్గాలకు మొండిచెయ్యి చూపారన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను వార్డు అధ్యక్షుడు ఉన్నం కష్ణమోహన్, దివి శ్రీనివాసరావు వార్డు నాయకులు పిడికిటి రఘనాధరావు, గంటా శ్రీకాంత్, దండే ఏడుకొండలు, దండే వెంకటేశ్వర్లు, రామిశెట్టి సురేష్, తిరుమల శెట్టి నవీన్, షేక్ అబ్దుల్ ఫయాజ్, షేక్ ఫాజల్ పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, వడ్డెళ్ళ రవిచంద్ర, బెజవాడ ప్రసాద్, షేక్ మున్నా, చుండూరు శ్రీనివాసులు, చవిడిబోయిన వెంకటకష్ణ,పులి నాగరాజు, దారం విజయకుమార్, షేక్ రూబీ, సయ్యద్ గౌస్ బాషా, సయ్యద్ జియావుద్దీన్, షేక్ కరిముల్లా ఉన్నారు.