Sep 28,2023 20:58

కడప యుటిఎఫ్‌ భవనం వద్ద జిపిఎస్‌ ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

కడప అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సాక్షిగా సిపిఎస్‌ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిపిఎస్‌ ప్రతులను యుటిఎఫ్‌ భవన్‌ ఎదుట నాయ కులతో కలిసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని మరిచి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయకపోగా ప్రస్తుతం ఉన్న సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్యారెంటీ లేని జిపిఎస్‌ విధానాన్ని అమలుపరిచేందుకు శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నట్లు తెలిపారు. జిపిఎస్‌ విధానం సిపిఎస్‌ కన్నా ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తుందని తెలి పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వంలో భాగమే అన్న విషయాన్ని మరిచి వారి ఆకాంక్షలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వాలకు తగదన్నారు. ప్రతి ఉద్యోగి 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తారని, అలాంటి ఉద్యోగి విరమణ పొందిన అనంతరం గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉం టుందని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వార దులుగా ఉండి ప్రజాసంక్షేమాన్ని కోరుకునే ఉద్యో గులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయడం తగద న్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగి వచ్చే ఎన్నికలలోపు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసి తీరాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏకమై ఉద్యమ కార్యాచరణ చేపట్టి ఈ ప్రభుత్వం దమన నీతిని ఎండ కడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు శ్రీనివాసులు, నాగ రాజు, అనిల్‌, సుజిత్‌, సిద్దయ్య, మజ్జారి చెన్న కశవులు, బాబు, శ్రీకాంత్‌, నాగరాజు పాల్గొన్నారు.
జమ్మలమడుగు రూరల్‌ : ప్రభుత్వాలు తీసుకొచ్చిన సిపిఎస్‌, జిపిఎస్‌లు ఉద్యోగుల పాలిట ఉరితాళ్లు లాంటివని వాటి వల్ల ఉద్యోగులకు నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు యాదవ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ వరకు జిపిఎస్‌కు వ్యతిరేకంగా ఎస్‌ టిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.విద్యాసాగర్‌ ఆధ్వ ర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు యాదవ్‌ మాట్లాడుతూ తక్షణమే ఈ జిపిఎస్‌ బిల్లును వెనక్కి తీసుకొని దాని స్థానంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆమోద యోగ్యమైన పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకు రావాలని లేనిపక్షంలో దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి విద్యా సాగర్‌, జిల్లా కార్యదర్శి వెంకటసుబ్బయ్య, నాయకులు దస్తగిరి, లక్ష్మీ చౌడయ్య, మునిశేఖర్‌, వెంకటేష్‌, రాఘవ, హుస్సేన్‌ పీరా, కే కష్ణయ్య, రమణమూర్తి, బాబా ఫక్రుద్దీన్‌ పాల్గొన్నారు.