అసైన్డ్‌మెంట్ చట్టానికి తూట్లు
ప్రజాశక్తి-బిట్రగుంట : జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత, గిరిజన సంక్షేమ పథకాలతో పాటు చట్టాలను కూడా రద్దు చేసుకుంటూ పోతున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి పేర్కొన్నారు. మండల కేంద్రం బోగోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో దళిత, గిరిజనులకు సంబంధించిన అసైన్డ్‌మెంట్ చట్టం 1/77 ద్వారా ఇందిరాగాంధీ బడుగు వర్గాల భూములకు రక్షణ కల్పించడమే కాకుండా అవి అమ్మిన కొన్నా చెల్లవని చట్టం పటిష్టంగా చేశారన్నారు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం అసైన్డ్‌మెంట్ చట్టాన్ని 75శాతం నిర్వీర్యం చేశారని తెలిపారు. ఎవరి చేతుల్లో భూములు ఉంటాయో 20 సంవత్సరాలు అనుభవం ఉంటే ఆ భూమి వారికి సర్వ హక్కులు ఉంటాయని, 10 సంవత్సరాలు ఇంటి స్థలం ఎవరైనా కొనుక్కుంటే వారిదే అవుతుందని ఇంకా అనేక సమస్యలతోటి అసైన్డ్‌మెంట్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని తెలియజేశారు. అసైన్డ్‌మెంట్ భూములను అగ్ర కులం వారి పరం చేయడం పేద వర్గాలను అణగతొక్కడం దళిత గిరిజనులకు భూమిపై హక్కు లేకుండా చేయడం భూహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడం దారుణమైన విషయమన్నారు. జగనన్న ఇచ్చే ఒక్కొక్క కానుక వల్ల జగనన్న దళిత గిరిజనకు దిమ్మతిరిగేలా చేస్తున్నారని ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్ రద్దు చేయడం కేంద్రం దళితుల అభివృద్ధికి ఇచ్చే నిధులు, ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు తమ వర్గానికి కాంట్రాక్టు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విధంగా పేద వర్గాలకు సంబంధించిన చట్టాలను, కార్పొరేషన్ రద్దు చేసి కానుకల మీద కానుకలు ఇస్తున్నారని, దళిత గిరిజనులను ఆర్థికంగా అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, భూ సమస్యలపై ఇప్పటివరకు పట్టించుకోకపోవడం వల్ల ఆ భూములన్నీ తన కులం వారికి పోతున్నాయని తెలియజేశారు. ఇక భూమిపై దళితులకు గిరిజనులకు హక్కు లేకుండా చేయడమే దారుణమైన విషయమని అసైన్డ్‌మెంట్ చట్టాన్ని యథాప్రకారం ఉంచాలని ఇంకా పదున్కెన చట్టాన్ని తెచ్చి దళిత భూములకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జరుగుమల్లి విజయరత్నం, దుగ్గిరాల రవి, దుగ్గిరాల చంద్రబాబు, వెంకటేశ్వర్లు, వెంకయ్య, మోహన్‌రావు, ఆత్మకూరి తేజ, ఆనందం, శ్రీనివాసులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.










