Jun 23,2023 23:45

సిపిఎం ఆధ్వర్యంలో అసైన్డ్‌ రైతుల నిరసన

తుళ్లూరు: రాజధాని ప్రాంతంలోని అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లిం పులో ప్రభుత్వం జాప్యం చేయడం పై సిపిఎం, అసైన్డ్‌ రైతులు నిరసన తెలిపారు. రాజధాని ప్రాంతం తుళ్లూరు ఎస్సీ కాలనీ లోని కమ్యూనిటీ హాలు వద్ద పెండింగ్‌ కౌలు చెల్లించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం అసైన్డ్‌ రైతులు నిరసనకు దిగారు. అసైన్డ్‌ రైతుల నిరస నలో పాల్గొన్న సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి మాట్లాడుతూ,రాజధానిలో పేదలుగా ఉన్న అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం, సి ఆర్‌ డి ఎ అధి కారులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అధికారుల ను ఎప్పుడు కలిసినా 10 రోజుల్లో కౌలు చెల్లిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. వెంటనే రాజధాని అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకపోతే అసైన్డ్‌ రైతులను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ సిఆర్డిఏ కార్యా లయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు .సిఐడి కేసులు పేరుతో అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు.రెండు సంవత్సరాల నుండి పెండింగ్‌ కౌలు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అసైన్డ్‌ రైతులకు నిరాశే మిగిలిందన్నారు. హైకో ర్టుకు వెళ్లి కంప్లైంట్‌ చేస్తే తప్ప అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించరా?..అని ప్రశ్నించారు.దళితులు, ఇతర పేదలైన అసైన్డ్‌ రైతులకు రెండు సంవత్సరాల నుండి కౌలు చెల్లించ కుండా వారి పట్ల దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రభుత్వం, అధికారులు వ్యవహరించడం సబబు కాదన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం,సి ఆర్‌ డి ఎ అధికారులు స్పందించి అసైన్‌ రైతులకు పెండింగ్‌ ఉన్న రెండు సంవత్సరాల కౌలు వెంటనే చెల్లించాలని,నిర్లక్ష్యం వహిస్తే సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆం దోళన చేపడతామని రవి హెచ్చరించారు.సిపిఎం రాజ ధాని డివిజన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.భాగ్యరాజు మాట్లాడుతూ,అసైన్‌ రైతులంతా సంఘటితమైతేనే ప్రభుత్వం,అధికారులు దిగివస్తారని అన్నారు. అసైన్డ్‌ రైతులకు సిపిఎం అండగా ఉంటుందని సిపిఎం అండతో పెండింగ్‌ కౌలు సాధించుకునేందుకు అసైన్‌ రైతులంతా ఆందోళనలకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్‌ నాయకులు పి. బాబురావు, అసైన్డ్‌ రైతులు బి.రాజు,కె లాజరు,జె.సుబ్బమ్మ, కె నాగేంద్రం,ఎం వీరయ్య పాల్గొన్నారు.