May 10,2023 22:45

ఎంఎల్‌ఎ సతీష్‌ కుమార్‌ కు వినతిపత్రం అందిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ప్రజాశక్తి - తాళ్లరేవు
అసైన్డ్‌ భూములు, ఇండ్ల స్థలముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎంఎల్‌ఎ సతీష్‌ కుమార్‌ స్థానిక తహశీల్దారు పోతురాజుతో మాట్లాడి వివరాలన్నీ సేకరించ వలసినదిగా ఆదేశాలు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వర రావు ఎంఎల్‌ఎ సతీష్‌కుమార్‌తో మాట్లాడారు. కోరంగిలో సుమారు 60 ఎకరాల అసైన్డ్‌ భూమిని లబ్ధిదారులకు ఇప్పించి పట్టాలు ఇవ్వాలన్నారు. కొత్త కోరంగిలో గ్రామకంఠం భూమిలో, కోరంగి హైస్కూల్‌ వద్ద గల గ్రామకంఠం భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిం చాలని, 1977లో చొల్లంగి చొల్లంగి పేట, జి. వేమవరం, పటవల, శాంతి మూల, కోరంగి, రాఘవేంద్రపురం, మట్లపాలెం గ్రామాలలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌ భూమికి పట్టాలు, పాస్‌ బుక్కులు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, దుప్పి అదృష్టదీపుడు, అనంతలక్ష్మి తదితరులు ఉన్నారు.