Aug 26,2023 11:40

సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్‌పి


ప్రజాశక్తి - నిజాంపట్నం
వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం నిజాంపట్నం పోలీస్‌ స్టేషన్‌ ను రేపల్లె డీఎస్పీ టీ మురళికష్ణ సందర్శించారు. తొలుత ఎస్‌ఐ రమేష్‌, పోలీస్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌ సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి అమ్మడం, కొనడం, సేవించడం కానీ ఎక్కడైనా ప్రజలకు సమాచారం తెలిస్తే పోలీస్‌ వారికి తెలపాలన్నారు. ఎవరైనా గంజాయి అమ్మిన, కొన్న వారితో పాటు ఎక్కడ నుంచి గంజాయి వస్తుందనే దానిపై పక్కగా దర్యాప్తు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట, కోడి పందాల, జూదాలు వంటి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసు నిఘా ఎప్పుడు ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ఇబ్బం దులు లేకుండా పాఠశాలలు, కళాశాలల వద్ద ఆకతాయిలు చేరకుండా ప్రతి రోజూ గస్తీని నిర్వహిం చాలని ఆదేశించారు. దొంగ తనాలు, నేరాలు జరగకుండా ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా పోలీస్‌ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. రేపల్లె రూరల్‌ సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ రమేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.