ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, అలాంటి వారి సమాచారం ఇవ్వాలని, చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సిఐ విక్రమ్ సింహా కోరారు. గురువారం పట్టణంలోని జామియా మసీదు వెనుక ప్రాంతంలో సిబ్బందితో దాడులు నిర్వహించి ముగ్గురు మట్కా బీటర్లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మట్కా బీటర్లు ఇస్మాయిల్, కన్నయ్య, శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని వారి నుంచి మట్కా చీటీలు, రూ.1.20 లక్షల నగదు, 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇక్బాల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. అక్రమ సారా, కర్ణాటక మద్యం అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారాన్ని 9121101135 ద్వారా పోలీసులకు అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. సిబ్బంది రంగస్వామి, హెచ్‌సి మద్దిలేటి, సుధీర్, మధు, వెంకటేష్, ముస్తాక్ ఉన్నారు.
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సిఐ










