Oct 18,2022 23:49

నూతనంగా ఎన్నికైన ఆశా యూనియన్‌ మండల కమిటీ

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏజెన్సీలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని సీఐటీయు రంపచోడవరం జిల్లా అధ్యక్షులు ఎం.వాణిశ్రీ డిమాండ్‌ చేశారు. మంగళవారం రంపచోడవరం ప్రజాసంఘల కార్యాలయం వద్ద ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రంపచోడవరం మండల మహాసభ కలింకోట రమణమ్మ అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాణిశ్రీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్‌ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కనీస వేతనాల మాట మరిచి శ్రమ దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కనీస వేతన చట్ట ప్రకారం ప్రతి ఆశావర్కరుకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని కోరుతూ భవిష్యత్తు పోరాటాలకు ఈ మహాసభ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రంపచోడవరం జిల్లా మహాసభకు ఏజెన్సీలో ఉన్నా ఆశవర్కర్లు అందరూ హాజరై జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో యూని నూతన మండల కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్ష, కార్యదర్సులుగా కొమరం చెల్లాయ్యమ్మ, కలింకోట రమణమ్మ, మరో 14 మందితో కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం మండలంలోని మూడు పీహెచ్సీల ఆశావర్కర్లు పాల్గొన్నారు.