Dec 07,2022 00:11

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆశా కార్యకర్తలు

ప్రజాశక్తి-పెందుర్తి, మధురవాడ : ఈ నెల 12,13 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను పెందుర్తి పాత పిహెచ్‌సి వద్ద ఆశ కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రెసిడెంట్‌ పద్మ మాట్లాడుతూ, విజయనగరంలో జరిగే మహాసభకు ఆశా కార్యకర్తలు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆశ కార్యకర్తలు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నాగమణి, ఉమాదేవి, భవాని తదితరులు పాల్గొన్నారు
మధురవాడ : విజయనగరంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ ఆశ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం మధురవాడ జోన్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం కనకరత్నం, బి.విజయ కోరారు. ఈ మహాసభల సందర్భంగా 12వ తేదీ ఉదయం విజయనగరం రైల్వే స్టేషన్‌ నుంచి జరిగే భారీ ర్యాలీలో ఆశా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మధురవాడ పిహెచ్‌సి వద్ద మహాసభల పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకరత్నం, విజయ మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, ఆశాలను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యు.శాంతి, ఎం.పార్వతి, ఎ.అప్పలకొండ, ధనలక్ష్మి, కె.లక్ష్మి, పి.సుజాత, సుధ తదితరులు పాల్గొన్నారు.