
తాడేపల్లి: తాడేపల్లి ముగ్గురోడ్డుకు చెందిన ఆశ వర్కర్ కృపమ్మ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆశ వర్కర్లు చేస్తున్న దీక్షలు సోమవారం నాటికి ఏడో రోజుకు చేరుకున్నాయి. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు టిడిపి, జనసేన, టిఎన్‌టియుసి నాయకులు మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృపమ్మ మృతికి కారణమైన ప్రకాష్‌నగర్ ఆసుపత్రి మెడికల్ అధికారి మానస మంజరి, రమాదేవిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని కోరారు. ఆశ వర్కర్లకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేముల దుర్గారావు, కె.లక్ష్మి, రేణుక, సుగుణ, కరుణ, సుమతి, టిడిపి పార్లమెంట్ కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పట్టణ అధ్య క్షులు వల్లభనేని వెంకట్రావు, టిఎన్‌టియుసి నియోజకవర్గ అధ్యక్షులు కెటివి ప్రసాద్, పి.వెంకన్న, సిహెచ్.వెంకటేశ్వర రావు, కె.మోహన్, రమేష్, కె.నాగేంద్రం, జనసేన మండల అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కోమలి, పి.అశోక్, పి.లాల్‌చంద్, అరుణ పాల్గొన్నారు.