Oct 26,2022 22:21

ప్రజాశక్తి కంచికచర్ల
స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం కంచికచర్ల, పెండ్యాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఆశ వర్కర్స్‌ యూనియన్‌ మహాసభ సీహెచ్‌ పుల్లమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ కమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఆశలకు సంబంధం లేని పనులు చేయించరాదని, పని భారం తగ్గించాలన్నారు. ప్రభుత్వ సెలవులు మెడికల్‌ లీవులు వేతనంతో కూడిన మెటర్నరటీ లీవులు అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షలు ఇవ్వాలని, 62 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ కాలంలో 2020 మార్చి నుండి మరణించిన ఆశలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇచ్చికుటుంబంలో అర్హులైన వారికి ఆశలుగా తీసుకోవాలన్నారు. 10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం ఒకేసారి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కంచికచర్ల, పెండ్యాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వేర్వేరుగా నూతన కమిటీని ఎన్ను కున్నారు. కంచికచర్ల మండల ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షు రాలుగా సి.హెచ్‌. పుపుల్లమ్మ, మండల కార్యదర్శి గా రోజ్‌ మేరి, ఎన్నుకోగా, నూతనంగా కంచికచర్ల పీహెచ్సీ అధ్యక్ష, కార్యదర్శులు గా వి.నాగమ్మ,వి.ప్రసన్న, కోశాధికారి గా సి హెచ్‌.పుల్లమ్మ తోపాటు, 11 మంది తో కమిటీ సభ్యు లుగా ఎన్నుకున్నారు.పెండ్యాల పీహెచ్‌సీ నుండి నూతనంగా అధ్యక్ష, కార్యదర్శులుగా పి.రోజ్‌ మేరీ, యం.జమలేశ్వరి, కోశాధికారి గా యం.రాణి, తోపాటు 7 గురిని కమిటీ సభ్యులు గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు బెజ్జం భూషణం తదితరులు పాల్గొన్నారు.