Dec 06,2022 23:37

ఎన్నికైన మండల కార్యవర్గ సభ్యులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌

ప్రజాశక్తి-విఆర్‌.పురం
మండలంలోని రేకపల్లిలో మంగళవారం జరిగిన ఆశా వర్కర్స్‌ యూనియన్‌ మండల మహాసభలో మండల కమిటీ ఎన్నిక జరిగింది. కూర ముత్తమ్మ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మండ కమిటీ మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఉయిక, కూర ముత్తమ్మ, కోశాధికారిగా మెట్టుం అనితతో పాటు 13 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ రానున్న కాలంలో ఆశా వర్కర్ల సమస్యలపై సంఘటితం కావాలన్నారు. చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆశాకు శ్రమకు తగిన వేతనాలు రావడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశ వర్కర్ల వేతనాలను పెంచాలని, వారికి అన్ని రకాల బెనిఫిట్స్‌ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వీటి సాధన కోసం ఆశా వర్కర్లు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.