Nov 07,2023 20:20

జామి: సమావేశంలో మాట్లాడుతున్న సురేష్‌

ప్రజాశక్తి - వంగర : ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి అన్నారు. ఈ మేరకు వంగరలో ఆశా వర్కర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పని ఒత్తిడి తగ్గించి కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మరణించిన ఆశ వర్కర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, కేంద్ర బడ్జెట్లో వైద్య రంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు పోరెడ్డి విశ్వనాథం, పలు గ్రామాలకు చెందిన ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
బొబ్బిలిరూరల్‌ : ఆశా వర్కర్లకు కనిసవేతనం అమలు చేయాలని సిఐటియు ఆద్వర్యలో చేపట్టనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు కోరారు. మంగళవారం పిరిడి పిహెచ్‌సి వద్ద ఆయన ఆశా వర్కర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆశాలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్ల పని చేసిన ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్‌ ఇస్తున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆశా వర్కర్లకు పెన్షన్‌, గాడ్యూటీ సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. నవంబర్‌ 27, 28 తేదీల్లో విజయవాడలో మహాధర్నా, డిసెంబర్‌ 11, 12 తేదీల్లో కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద 36 గంటల ధర్నా చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆశా యూనియన్‌ నాయకులు రాధ, రవణమ్మ, ఎల్లమ్మ, నారాయణమ్మ, పాల్గొన్నారు.
జామి: విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని మంగళవారం జరిగిన ఆశా కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 20 అంశాలపై ఇటీవల సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్ర డిమాండ్లను వెల్లడించారు. మహా దర్నాలో అందరూ పాల్గొవాలన్నారు.