Jul 13,2023 00:33
మాట్లాడుతున్న యూనియన్‌ అధ్యక్షురాలు ధనలక్ష్మి

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రవ్యాప్త ఆశ వర్కర్ల సమస్యలపై ఈ నెల 18న డిఎంహెచ్‌ఓ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయ ప్రదం చేయాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షు రాలు డి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. సీఐటీయూ బాపట్ల జిల్లా కార్యాలయంలో జరిగిన ఆశా వర్కర్ల జిల్లా సమావేశంలో ధనలక్ష్మి మాట్లాడారు. ఆశా వర్కర్లపై పెరుగుతున్న పని ఒత్తిడి తగ్గించాలన్నారు. నాణ్యమైన 4జి ఫోన్లు అందజేయా లన్నారు. ఆన్‌లైన్‌లో చేసే సేవలకు మినహాయింపు కల్పించాల న్నారు. ఆరోగ్య శాఖతో సంబంధంలేని పనులు చేయించరాదన్నారు. వేతనంతో కూడిన సెలవులు మంజూ రు చేయాలి. ఆశా సమస్యలు పరిష్కారం చేయలేని నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూలై 18న డీఏంహెచ్‌ఓ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాకు తరలిరావాలని వర్కర్లను కోరారు. సమావేశంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పని భారం పెరుగు తోందని అన్నారు. చాలాచోట్ల అధికారులు ఆశావర్కర్లకు సంబంధం లేని ఇతర పనులు కేటాయిస్తూ తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సెలవులు ఇవ్వకపో వడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రతిరోజూ పిహెచ్‌సికి రావాలని చాలాచోట్ల ఫోన్లు చేస్తున్నా రు. టిఎ, డిఏలు కూడా ఇవ్వటం లేదు. సబ్‌ సెంటర్లను శుభ్రం చేయించడం, సొంత ఖర్చులు వెచ్చించి రికార్డులు ఆశ వర్కర్ల ద్వారా సమకూర్చుకోవడంలాంటి సమస్యలు ఉన్నా యని పేర్కొన్నారు. సమావేశంలో ఆశా వర్కర్స్‌ యూని యన్‌ బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ వెంకటేశ్వరమ్మ, రజినికుమారి, ఆశా జోతి, ఎస్‌ సలిమా, వై వరలక్ష్మి, బుజ్జి, ఎం రజని కుమారి, ఏ వెంకాయమ్మ పాల్గొన్నారు.