Feb 27,2023 23:02

  • ఎన్‌టిఆర్‌ జిల్లా డిఎంహెచ్‌ఒకు యూనియన్‌ నేతల వినతి

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌ : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన సోమవారం ఎన్‌టిఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిఎంఅండ్‌హెచ్‌ఒ) ఎం.సుహాసినికి వినతిపత్రం సమర్పించారు. విజయవాడలోని డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో ఆమెను యూనియన్‌ జిల్లా నాయకులు ఎ.కమల, పి.శ్రీలక్ష్మి, పద్మ, శివకుమారి కలిసి ఆశా వర్కర్లకు సంబంధంలేని ఏ ఇతర పనులను వారితో చేయించొద్దని కోరారు. జిల్లా అంతా ఒకే నిర్వహణ రిజిస్టర్‌ అమలు చేయాలని, ఆశాలు మెయింటైన్‌ చేసే రిజిస్టర్లను వైద్య ఆరోగ్య శాఖ నుండి ఇవ్వాలని, ఆశ వర్కర్లకు అనారోగ్యం లేదా అత్యవసర సమయాల్లో పర్మిషన్లు, సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిజిహెచ్‌కు కేసులు తీసుకెళ్తున్న ఆశాలకు రెస్ట్‌రూమ్‌ సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో కోరారు.