Dec 11,2022 00:01

సత్యసాయి వాటర్‌ స్కీమ్‌ వర్కర్ల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న ఆశా వర్కర్లు

ప్రజాశక్తి-రంపచోడవరం : ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.వాణిశ్రీ డిమాండ్‌ చేశారు. శనివారం ఆశా వర్కర్స్‌ డిమాండ్స్‌ డే, మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న స్కీమ్‌ వర్కర్ల పట్ల అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చనిపోయిన ఐదుగురు ఆశా వర్కర్ల కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సత్యసాయి వాటర్‌ స్కీమ్‌ వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పారు. వీరి సమస్యలను పరిష్కారం చేసే దిశగా అధికారులు, ప్రభుత్వం చొరవ చూపకు పొతే రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలతో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తొలుత 17వ రోజులుగా సత్యసాయి వర్కర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. కలింకోట రమణమ్మ, కొమరం చెల్లయమ్మ, కుంజం రాధమ్మ, సవిర్ల వెంకటలక్ష్మి, కొంతుల పోశమ్మ, పల్లాల లింగామణి, కుండ్ల జయలక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు.