Nov 28,2022 23:55

ఆశా కార్యకర్తలతో సిఐటియు నేతలు శ్రీనివాసరావు, బ్రహ్మాజీ

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య సమస్యలపై అహర్నిశలు కృషి చేస్తున్న ఆశా కార్యకర్తలను పర్మినెంట్‌ చేసి, మెరుగైన వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కోశాధికారి వీవీ శ్రీనివాసరావు, మండల కన్వీనర్‌ ఎస్‌.బ్రహ్మాజీ డిమాండ్‌ చేశారు. ఎపి వాలంటరీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఆశా) మండల మహాసభ సోమవారం మునగపాకలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పని భారం పెంచడంతో ఆశాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, పర్మినెంట్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మండల కమిటీ ఎన్నిక
అనంతరం ఆశా యూనియన్‌ మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, కార్యదర్శులుగా పార్వతి, కుమారి, కమిటీ సభ్యులుగా ఎం.గంగాభవాని, ఉమాదేవి రూప, శ్రావణి, సిహెచ్‌ నాగలక్ష్మి, పి.లక్ష్మి, నాగమణి, కుమారి, మహాలక్ష్మి సరోజినీ, భవాని, వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మునగపాక, చూచుకొండ పిహెచ్‌సిల పరిధిలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.