Jul 18,2023 16:33

ధర్నాలో మాట్లాడుతున్న ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం ఖాయం
సిఐటియు, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

    ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిషరించాలని డి ఎం హెచ్ ఓ కార్యాలయం కు కదం తొక్కారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆదోళన ఉదృతం చేస్తామని ఆశాలు హెచ్చరించారు.మంగళవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు)ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. అంతకు ముందు సీఐటీయూ కార్యాలయం నుండి డి ఎం హెచ్ ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వనికి పతనం ఖాయమని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు వి.ఎసురత్నం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమణి ,రమణకుమారీ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్స్ తో సంబందం లేని పనులు చేయిస్తూ పని భారం పెంచుతున్నరన్నారు.నాణ్యమైన సెల్ఫోన్ 4జి సిమ్స్ ఇవ్వాలని, ఆన్లైన్ వర్క్ శిక్షణ ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.ఆశా వర్కర్ లకు సంబంధంలేని పనులు చేయించరాదని, ఆన్లైన్ వర్కుల పేరుతో జరుగుతున్న వేదింపులు, బెదిరింపులు: వెంటనే ఆపాలని, ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలని కోరారు.పనిచేయని సెల్ఫోన్లతో ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సక్రమంగా పనిచేయటంలేదు. 20 సిమ్ ఇవ్వటం వలన నెట్వర్క్ ప్రాబ్లమ్ కూడా చాలా ఎక్కువుగా ఉన్నది. నాణ్యమైన సెల్ఫోన్ 4జీ సిమ్ అవ్వాలని కోరుతున్నాము. 14 రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని వాటి నుంచే పనిచెయ్యాలని, 26 రకాల రికార్డులు వ్రాయాలని ప్రభుత్వం హుకుం జారీచేసింది. సెల్ఫోన్స్ పనిచేయకపోతే చేతి నుండి డబ్బు పెట్టి ఫోన్ కొనుగోలుచేసి పనిచేయాలని వేధిస్తున్నారన్నారు. రికార్డులు కూడా సొంత డబ్బులతో కొనుగోలు చేయాలని, లేకుంటే వేతనాలు కట్చేస్తామని, ఉద్యోగం నుండి తొలగిస్తామని, అధికారుల బెదిరింపులు, వేదింపులు పెరిగాయి. ఆన్లైన్ వర్కులపై శిక్షణ లేకపోవడంతో అలా వర్కర్స్ తీవ్ర ఆందోళనకు, మానసిక వేదనకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆశావర్కర్స్ ని రోజు విలేజ్ క్లినిక్ & సచివాలయాలలో ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు ఉండాలని, క్లినిక్ లు క్లీన్ చేయటం, ఓపీ వర్క్, అటెండర్ పనులు చేయించడం తో పాటు ఉదయం సాయంత్రం రెండు సార్లు రిజిస్టర్ లో సంతకాలు చేయాలని అధికారులు వేధిస్తున్నారు. రికార్డ్స్ సొంత డబ్బులు పెట్టి కొనాలని, సంబంధం లేని ఆన్లైన్ వర్క్ లన్ని సొంత ఫోన్ ద్వారా చేయాలని వేధిస్తున్నారు. శెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలౌతున్నారు. అలా వర్కర్లు కు సంబంధం లేని పనులు చేయించటం- వాక్సిన్ బాక్స్ లు తీసుకు రావటం, ఆన్లైన్ వర్క్ లు, చేయించటం ఆపాలని కోరుతున్నాము... ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు ఆశా వర్కర్స్క సంబంధం లేని పనులు చేయించరాదని,ఆన్లైన్ వర్క్స్ భారాన్ని తగ్గించాలని వారు పేర్కొన్నారు.ఆన్లైన్ లేదా రికార్డ్స్ ఒక పని ఒక్కసారి మాత్రమే చేసేలగా చూడాలని అధి కారుల బెదిరింపులు, వేధింపులు ఆపాలని,నాణ్యమైన సెల్ ఫోన్స్, 4 జి సిమ్స్ ఇవ్వాలని కోరారు.శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్స్ వెంటనే అమలు చేయాలన్నారు.  సచివాలయాలు,సబ్ సెంటర్స్ లో ప్రతిరోజు ఉదయం 9 గం||ల నుండి సాయంత్రం 5గం||ల వరకు కూర్చోబెట్టడం ఆపాలని, రిజిస్టర్ లో ప్రతిరోజు సంతకాలు చేయించడం వెంటనే ఆపాలని పిహెచ్ కి పిలిపించిన ప్రతి సందర్భంలోనూ టీ.ఎ, డి.ఎ లు ఇవ్వాలని లేదా నెలకు 4,5 సార్లు పి హెచ్ సి లకు ఆశా వర్కర్స్ను పిలిపించడం ఆపాలన్నారు.లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం  ఆశాల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ డిఎం అండ్ హెచ్ ఓ కి వినతి పత్రం సమర్పించారు.కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శివమ్మ, షమీమ్లతోపాటు వివిధ మండలాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు, పిహెచ్సి ల లీడర్లు,  ఆశా వర్కర్లు పాల్గొన్నారు.