ప్రజాశక్తి - పర్చూరు
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా పర్చూరుకు చెందిన మామిడిపాక హరిప్రసాద్ ఎంపికయ్యారు. ఈమేరకు ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ ఉత్తర్వులు జారీచేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు హరిప్రసాద్ ని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు సీరం సుబ్బారావు, పల్లపోతు రాఘవయ్య, ఊటుకూరి సుబ్బారావు, బాపనపల్లి భాస్కరరావు, ఎక్కల సుబ్బారావు, మామిడిపాక పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.










