Oct 01,2023 00:48

ఆర్డీఓ కు వినతి పత్రం అందజేస్తున్న చిత్రం

సత్తెనపల్లి రూరల్‌: రైల్వే అండర్‌ గ్రౌండ్‌ బ్రిడి ్జ(ఆర్‌యుబి) నిర్మించవద్దని అధి కారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం కంకణాల పల్లి పంచాయతీ పరిధిలోని రైల్వే గేటు ఎల్‌ సీ నెం 41 స్థానంలో ఆర్‌యూబీని నిర్మిం చేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల అభిప్రాయాలు సలహాలు తీసుకునేందుకు సత్తెనపల్లి ఆర్డీఓ బిఎల్‌ఎన్‌ రాజకుమారి తహశీల్దార్‌, ఎస్‌ సురేష్‌, రైల్వే ఎడిఆర్‌ఎం టి వి కృష్ణయ్య లు శనివారం రైల్వే గేటు వద్ద వెళ్ళారు. అయితే, 'ఆర్‌యూబీ మాకొద్దు' అని గ్రామస్తులు స్పష్టం చేశారు. రైతులకు, గ్రామ స్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్‌యూబీని నిర్మిస్తామని గ్రామస్తులకు రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. వర్షా కాలంలో అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి లోకి వర్షపు నీరు వస్తోందని , దీనివలన వ్యవసాయ కూలీలు పనులకు వచ్చే పరిస్థితి లేదని అధికారులకు వివరించారు. సిపిఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలకు భిన్నంగా ఆర్‌యూబీ నిర్మాణం చేపడితే పనులను అడ్డు కుంటామని హెచ్చరించారు. ఆర్డీఓకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చెరుకూరి వన్నూరు, రైతులు ఎం.శ్రీనివాసరావు, జి.సుబ్బారావు, పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.