ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని జానపాడు రోడ్డు హైవేకు ఇరువైపులా నివాసం ఉంటున్న పేదలకు న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న వంద కుటుంబాల వరకూ నోటీసులు జారీ చేశారని చెప్పారు. కూలీనాలీ చేసుకుని జీవనాధానం సాగించే పేదల ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారని, ఉన్నట్టుండి ఖాళీ చేయాలంటే వారెక్కడికి వెళ్తారని ప్రశ్నిం చారు. మెరుగైన ప్రత్యామ్నాం చూపాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కమిషనర్‌కి వినతిపత్రం ఇచ్చి చర్చించారు. బాధితుల్లో అర్హులకు టిడ్కో ఇళ్లలో ప్లాట్లు లేదా, జగనన్న కాలనీల్లో స్థలం కేటాయించి ఇళ్లు కట్టిస్తామని, అప్పటి వరకూ అద్దె రూపంలో పరిహారం ఇస్తామని హామీనిచ్చారు. ధర్నాలో డి.గంగాలు, ఎం.శంకర్రావు, సిహెచ్.వెంకటేశ్వర్లు, రాములు, రామకో టయ్య, శ్రీను, డి.మంగమ్మ, వి.రాజేశ్వరి, బి.గంగ పాల్గొన్నారు.










